Gold rates: బంగారం ధరల్లో తగ్గుదల..! 23 d ago

8K News-21/03/2025 గత వారం రోజులుగా పెరుగుతున్న పసిడి ధరలు.. ఇవాళ (శుక్రవారం) తగ్గుముఖం పట్టాయి. నిన్నటితో పోలిస్తే 22,24 క్యారెట్ల 10 గ్రాముల పసిడిపై ₹400, ₹440 తగ్గింది. ఈ తగ్గుదలతో కొనుగోలుదారులకు కాస్త ఊరట కలిగింది. హైదరాబాద్, విజయవాడ నగరాల్లో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.82,700 ఉండగా.. అదే 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.90,220 వద్ద పలుకుతోంది. ఇక వెండి విషయానికి వస్తే ₹2,100 తగ్గి... రూ.1,12,000 వద్ద పలుకుతోంది.